School Bus Acccident: హర్యానాలో స్కూలు బస్సు బోల్తాపడి ఆరుగురు చిన్నారుల మృతి

6 kids killed in Haryana school bus accident on Ramadan holiday
  • మహేంద్రగఢ్ జిల్లాలో ఘటన
  • ప్రమాద సమయంలో బస్సులో 40 మంది చిన్నారులు
  • మద్యం మత్తులో బస్సు డ్రైవర్
హర్యానాలోని మహేంద్రగఢ్ జిల్లాలో రంజాన్ రోజున విషాదం జరిగింది. జీఎల్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన బస్సు బోల్తాపడి ఆరుగురు చిన్నారులు మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది చిన్నారులు ఉన్నారు. చిన్నారులను ఎక్కించుకుని స్కూలుకు తీసుకెళ్తున్న బస్సు ఉన్హానీ గ్రామంలో బోల్తాపడింది.

 ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా, 15 మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గాయపడిన చిన్నారులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
School Bus Acccident
Haryana
Ramdan
Eid-ul-Fitr

More Telugu News