Arvind Kejriwal: కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తోందన్న వార్తల్లో నిజం లేదు: తీహార్ జైలు అధికారుల స్పష్టీకరణ

Kejriwal health is good says Tihar jail officials
  • కేజ్రీవాల్ 1 కిలో బరువు పెరిగారన్న తీహార్ జైలు అధికారులు
  • షుగర్ లెవెల్స్ నిలకడగా ఉన్నాయని వెల్లడి
  • ఆయన ఆరోగ్యం చాలా బాగుందన్న అధికారులు
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. జైలుకు వెళ్లిన తర్వాత ఆయన బరువును కోల్పోయారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా కేజ్రీవాల్ ఆరోగ్యంపై తీహార్ జైలు అధికారులు కీలక ప్రకటన చేశారు. కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తోందన్న వార్తల్లో నిజం లేదని వారు తెలిపారు. కేజ్రీవాల్ కు ప్రతి రోజు డయాబెటిక్ పరీక్షలను నిర్వహిస్తున్నామని... షుగర్ లెవెల్స్ నిలకడగా ఉన్నాయని చెప్పారు. కేజ్రీ చాలా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. ఏప్రిల్ 1న కేజ్రీవాల్ బరువు 65 కిలోలుగా ఉందని, ప్రస్తుతం ఆయన బరువు 66 కిలోలకు చేరుకుందని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం చాలా బాగుందని చెప్పారు.
Arvind Kejriwal
AAP
Health

More Telugu News