పవన్ కల్యాణ్ మగాడైతే నా గురించి డైరెక్ట్ గా మాట్లాడాలి: ముద్రగడ పద్మనాభం తీవ్ర వ్యాఖ్యలు
- తనను క్యారెక్టర్ ఆర్టిస్టులతో తిట్టిస్తున్నారని ముద్రగడ మండిపాటు
- పవన్ మగాడైతే ప్రెస్ మీట్ పెట్టి నేరుగా మాట్లాడాలని సవాల్
- సీఎం జగన్ పై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపాటు
పవన్ కల్యాణ్ హైదరాబాద్ లో పుట్టారని... ఆ తెలంగాణ రాష్ట్రం వేరు, మన ఏపీ వేరని ముద్రగడ అన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చి పిఠాపురంలో ఎమ్మెల్యే కావాలని కోరుకోవడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. హైదరాబాద్ లో అవమానం జరిగినప్పుడు ఇప్పుడున్న ఈ పౌరుషం, కోపం, పట్టుదల ఏమయ్యాయని అడిగారు. అవమానించిన వారి ఇంటికే వెళ్లి టిఫిన్ చేశారని ఎద్దేవా చేశారు.
పవన్ రెచ్చిపోయి మాట్లాడుతున్నారని ముద్రగడ విమర్శించారు. ఎన్నికల్లో వైసీపీ కోట్లు ఖర్చు పెడుతుందని అంటున్నారని... ప్రజలు అమ్ముడుపోతారనే కోణంలో మాట్లాడుతున్నారని అన్నారు.