జగన్ సర్కారుకు ఈ ఘటన సిగ్గుచేటు: షర్మిల
- బిడ్డ మృతదేహాన్ని మోసుకుంటూ వెళ్లిన తండ్రి వార్త క్లిప్పింగ్ ట్వీట్
- పేదల కనీస అవసరాలు తీర్చలేని ప్రభుత్వం ఎందుకని నిలదీత
- రాజన్న పాలన అంటే ఇలానే ఉంటుందా అని ప్రశ్నించిన ఏపీసీసీ చీఫ్
రోడ్డు సౌకర్యం లేక బిడ్డ మృతదేహాన్ని మోసుకుంటూ ఓ తండ్రి 8 కిలోమీటర్లు నడిచి వెళ్లిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన కథనం మీడియా ప్రచురించింది. ఈ వార్తా కథనాన్ని ట్వీట్ చేస్తూ జగన్ సర్కారుపై షర్మిల మండిపడ్డారు. రాజన్న బిడ్డనని, ఆంధ్రప్రదేశ్ లో రాజన్న పాలన అందిస్తున్నానని జగన్ చెప్పుకుంటున్నారని విమర్శించారు. రాజన్న పాలన అంటే ఇలానే ఉంటుందా? అని షర్మిల నిలదీశారు. ‘అందుకే చెబుతున్నా.. వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో అధికార పార్టీకి బుద్ది చెప్పండి’ అంటూ రాష్ట్ర ప్రజలకు షర్మిల పిలుపునిచ్చారు.