Raghu Rama Krishna Raju: ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించిన రఘురాజు.. ఉండి నుంచి పోటీ చేస్తానని వ్యాఖ్య!

Raghu Rama Krishna Raju started election campaign office in Undi constituency
  • 48 గంటల్లో తన టికెట్ పై స్పష్టత వస్తుందన్న రఘురాజు
  • పెదఅమిరంలో ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ
  • రామరాజును బుజ్జగించే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు
ఉండి అసెంబ్లీ టీడీపీ టికెట్ తనదేనని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి ధీమా వ్యక్తం చేశారు. తన టికెట్ విషయంలో 48 గంటల్లో స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని పెదఅమిరంలో ఆయన ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. తద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. 

ఉండి టీడీపీ టికెట్ ను చంద్రబాబు ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు కేటాయించారు. ఈ నేపథ్యంలో అసంతృప్తికి గురైన టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో, ఇద్దరి మధ్యలో టికెట్ రఘురాజుకు దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

రామరాజుకు టికెట్ క్యాన్సిల్ చేసి... రఘురాజుకు చంద్రబాబు టికెట్ ఇవ్వబోతున్నారని చెపుతున్నారు. ఆ ధీమాతోనే రఘురాజు ఉండి నియోజకవర్గంలో పార్టీ ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించారు. రామరాజును బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. రఘురాజు బరిలో ఉంటే శివరామరాజు శాంతిస్తారని నియోజకవర్గ టీడీపీ శ్రేణులు చెపుతున్నాయి. ఈ క్రమంలో, రామరాజును కూడా ఒప్పిస్తే రఘురాజుకు అన్ని అడ్డంకులు తొలగిపోయినట్టే.
Raghu Rama Krishna Raju
Undi
Telugudesam
Chandrababu

More Telugu News