మోసాలు, వంచనలకు జగన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్: దేవినేని ఉమా
- ఇల్లు పేరిట పేదలను జగన్ నిలువునా మోసం చేశాడంటూ టీడీపీ నేత ధ్వజం
- ఓటీఎస్ పేరిట 7 లక్షల మంది నిరుపేదలకు కుచ్చుటోపీ పెట్టిన ఘనుడన్న దేవినేని
- సెంటుపట్టా పేరుతో సొంత పార్టీ నేతల జేబులు నింపి పేదలను ముంచేశాడని మండిపాటు
అంతేగాక గత ప్రభుత్వాలు ఇల్లు ఇచ్చిన లబ్ధిదారుల వద్ద రూ. 10 వేలు వసూలు చేయడం దారుణమన్నారు. అలాగే ఓటీఎస్ పేరిట 7 లక్షల మంది నిరుపేదలకు కుచ్చుటోపీ పెట్టిన ఘనుడు జగన్ అని ఫైర్ అయ్యారు. వందల కోట్లు వసూలు చేసి చెల్లని కాగితాలు చేతిలో పెట్టాడని దుయ్యబట్టారు. సెంటుపట్టా పేరుతో సొంత పార్టీ నేతల జేబులు నింపి పేదలను ముంచేశాడని ఉమా మండిపడ్డారు.
ఆ పట్టాలపై జగన్ బొమ్మలు తప్ప ప్రజలకు వాటి వల్ల ఒరిగిందేమీ లేదని అన్నారు. బ్యాంకులు సైతం ఆ పత్రాలు చెల్లవని తేల్చేశాయని గుర్తు చేశారు. ఇలా పనికిరాని పట్టాలతో మోసం చేసిన సీఎం జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని దేవినేని ఉమా ట్వీట్ చేశారు.