పవన్ కల్యాణ్ పై బిగ్‌బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి పోటీ
- ఆసక్తికరంగా మారిన పిఠాపురం నియోజకవర్గ రాజకీయాలు
- జనసేన అధినేతపై పోటీగా వంగా గీతను నిలిపిన వైసీపీ
- తాజాగా పవన్‌పై పోటీకి సై అన్న బిగ్‌బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి
- గతంలో జనసేనలోనే పనిచేసిన తమన్నా సింహాద్రి
- టీడీపీతో పొత్తు తర్వాత పవన్‌పై విమర్శలు
అయితే, ప్రముఖులపై పోటీకి దిగడం తమన్నా సింహాద్రికి కొత్తేమీ కాదు. గతంలో ఆమె మంగళగిరిలో నారా లోకేశ్‌పై పోటీ చేసి సంచలనం సృష్టించారు. ఒకప్పుడు జనసేన పార్టీలో ఉన్న తమన్నా సింహాద్రి అప్పట్లో మంగళగిరి టిక్కెట్ ఆశించారు. టిక్కెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. ఆ తరువాత కూడా పవన్‌కు మద్దతు కొనసాగించారు. అయితే, టీడీపీ-జనసేన పొత్తు తర్వాత పవన్‌పై విమర్శలు ప్రారంభించిన తమన్నా చివరకు జనసేన అధినేతపైనే పోటీకి దిగారు.