Nimmaka Jayakrishna: పాలకొండ జనసేన అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణను ప్రకటించిన పవన్ కల్యాణ్

Pawan Kalyan announced Nimmaka Jayakrishna as Palakonda Janasena candidate
  • పాలకొండ ఎస్టీ రిజర్వ్ డ్ అసెంబ్లీ టికెట్ కోసం తీవ్ర పోటీ
  • పలు సర్వేలు చేయించిన జనసేన పార్టీ
  • అత్యధిక ప్రజల మద్దతు ఉన్న నిమ్మక జయకృష్ణకు టికెట్ ఖరారు
  • ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన నిమ్మక జయకృష్ణ
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం జనసేన అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ అవకాశం దక్కించుకున్నారు. ఇవాళ జనసేనాని పవన్ కల్యాణ్ నిమ్మక జయకృష్ణ పేరును పాలకొండ జనసేన అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించారు. పాలకొండ నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్ అసెంబ్లీ స్థానం. పాలకొండ నుంచి మిత్రపక్షాల అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణను బరిలో దించుతున్నట్టు ఇవాళ జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. 

ఈ నియోజకవర్గం టికెట్ కోసం ఆశావహులు ఎక్కువమంది ఉండడంతో జనసేన పార్టీ పలు సర్వేలు నిర్వహించి, చివరికి నిమ్మక జయకృష్ణ పేరు ఖరారు చేసింది. సర్వేల్లో నిమ్మక జయకృష్ణ అత్యధిక ప్రజల మద్దతు  లభించినట్టు తెలుస్తోంది. నిమ్మక జయకృష్ణ ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు.
Nimmaka Jayakrishna
Palakonda
Janasena
Pawan Kalyan
TDP-JanaSena-BJP Alliance

More Telugu News