చంద్రయాన్-4 పై స్పందించిన ఇస్రో చైర్మన్ సోమనాథ్
- 'చంద్రయాన్-4' అభివృద్ధి దశలో ఉందన్న ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్
- అంతరిక్ష పరిశోధన అనేది నిరంతర ప్రక్రియ... ఇందులో భారత్ గొప్ప పురోగతిని సాధిస్తోందని వ్యాఖ్య
- చంద్రుడిపై తదుపరి మిషన్‌కు ఇస్రో కట్టుబడి ఉందన్న చైర్మన్
చంద్రయాన్-4 ప్రయోగంలో భాగంగా చంద్రుడిపై నుంచి మట్టి, నీళ్ల నమూనాలను భూమి మీదకు తీసుకు రావాలని ఇస్రో భావిస్తోంది. ఇది దాదాపు 100 రోజులు పని చేసేలా... చంద్రుడిపై కిలో మీటర్ మేర తిరిగేలా రూపొందిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇందుకు రెండు వాహక నౌకలను సిద్ధం చేయాల్సి ఉంటుంది.