Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విశ్వంభర సెట్స్ పై పవన్ కు త్రిష కానుక

Trisha gifts a plant to Pawan Kalyan
Advertisement
  • హైదరాబాద్ శివార్లలో చిరంజీవి విశ్వంభర షూటింగ్
  • నిన్న షూటింగ్ లొకేషన్ కు వెళ్లి అన్నయ్య ఆశీస్సులు పొందిన పవన్
  • ఈ సందర్భంగా పవన్ ను కలిసిన త్రిష
  • పవన్, త్రిష జంటగా గతంలో 'తీన్ మార్' చిత్రం
Advertisement
జనసేనాని పవన్ కల్యాణ్ నిన్న విశ్వంభర షూటింగ్ లొకేషన్ లో సందడి చేసిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, త్రిష జంటగా యువ దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం విశ్వంభర. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్ వద్ద షూటింగ్ జరుపుకుంటోంది. 

పవన్ కల్యాణ్, నాగబాబు షూటింగ్ లొకేషన్ కు వచ్చి అన్నయ్య చిరంజీవి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి జనసేన పార్టీకి రూ.5 కోట్ల భారీ విరాళం అందించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో, మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 

విశ్వంభర షూటింగ్ లొకేషన్ కు వచ్చిన పవన్ కల్యాణ్ కు నటి త్రిష ఓ కానుక అందించారు. ఓ మొక్కను పవన్ కు బహూకరించారు. గతంలో పవన్ కల్యాణ్, త్రిష 'తీన్ మార్' సినిమాలో జంటగా నటించారు. ఈ చిత్రం 2011లో వచ్చింది. మళ్లీ 13 ఏళ్ల అనంతరం పవన్, త్రిష ఇలా విశ్వంభర సెట్స్ పై కలిశారు.
Advertisement
Advertisement
Pawan Kalyan
Trisha
Gift
Vishwambhara
Teenmaar
Hyderabad
Tollywood

More Telugu News