Cable Bridge: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై వాహనం నిలిపితే వేయి రూపాయల ఫైన్

Rs 1000 fine for vehicle parking on Hyderabad cable bridge
హైదరాబాద్ దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ కి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బ్రిడ్జ్ పై ఫొటోలు దిగేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో బ్రిడ్జ్ పై టూవీలర్స్ ను పార్క్ చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ రద్దీ నెలకొంటోంది. బ్రిడ్జ్ పై ఆదివారం జరిగిన ప్రమాదంలో ఒకరు చనిపోయారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఇకపై బ్రిడ్జ్ పై వాహనాన్ని ఆపితే రూ. 1000 జరిమానా విధిస్తామని పోలీసులు తెలిపారు. ప్రమాదాల నివారణకే ఈ జరిమానాలు అని చెప్పారు. బ్రిడ్జి వరకు వచ్చి ఫొటోలు, సెల్ఫీలు తీసుకోవచ్చని... బర్త్ డే కేక్ లు కట్ చేయడం మాత్రం కుదరదని స్పష్టం చేశారు. బ్రిడ్జ్ పై కేక్ కటింగ్స్ బ్యాన్ చేశామని తెలిపారు. వాహనదారులు ఈ మార్పును గమనించాలని కోరారు. బ్రిడ్జ్ వద్ద ఎక్కువ మంది పోలీసులు విధుల్లో ఉంటారని చెప్పారు.
Cable Bridge
Hyderabad
Fine

More Telugu News