పిఠాపురంలో జనసేనాని గృహప్రవేశం.. ఉగాది వేడుకలు.. వీడియో ఇదిగో!
- చేబ్రోలులో ఇల్లు తీసుకున్న పవన్ కల్యాణ్
- అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేయనున్న జనసేన చీఫ్
- స్థానికంగా ఉండరనే ప్రత్యర్థుల ప్రచారానికి చెక్
పిఠాపురం నుంచి పోటీ చేయనున్న పవన్ కల్యాణ్ పై ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పించారు. ఆయన స్థానికంగా ఉండరంటూ ప్రచారం చేశారు. దీనికి చెక్ చెప్పేందుకే పవన్ కల్యాణ్ చేబ్రోలులో ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో ఓదూరి నాగేశ్వరరావు అనే వ్యక్తి ఈ ఇంటిని నిర్మించుకున్నారు. ఆయన దగ్గర నుంచి పవన్ ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం ఈ ఇంట్లో గృహప్రవేశం చేసిన పవన్ కల్యాణ్.. ఉగాది వేడుకలను జనసేన నాయకులు, అభిమానుల మధ్య ఘనంగా జరుపుకున్నారు.