అలర్ట్.. టీఎస్ ఈఏపీసెట్ దరఖాస్తుల సమర్పణకు రేపే చివరి తేదీ
- ఫిబ్రవరి 26న మొదలైన దరఖాస్తుల స్వీకరణ
- ఏప్రిల్ 6తో ముగియనున్న వైనం
- లేట్ ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు ఒక్క రోజే అవకాశం
- ఇప్పటివరకూ 3,21,604 దరఖాస్తులు వచ్చాయన్న జేఎన్టీయూహెచ్
ఇప్పటివరకూ టీఎస్ ఈఏపీసెట్‌కు భారీగా దరఖాస్తులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,33,517 మంది, అగ్రికల్చర్ / ఫార్మా విభాగాల్లో 87,819 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం టీఎస్ ఈఏపీసెట్‌కు 3,21,604 దరఖాస్తులు వచ్చాయని జేఎన్టీయూహెచ్ వెల్లడించింది. ఈసారి గడువు తేదీ ముగియకముందే గతేడాదితో పోలిస్తే అత్యధిక దరఖాస్తులు అందాయని సమాచారం.
ఈఏపీసెట్ పరీక్షను మే 7 నుంచి 11 మధ్య నిర్వహించనున్నారు. మే 7, 8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, మే 9,10,11 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నాయి.