మీ న”మ్మక”స్తుడు నిమ్మగడ్డ రమేశ్‌తో వాలంటీర్లపై విషం చిమ్మించావు: విజయసాయిరెడ్డి

  • పురందేశ్వరితో 22 మంది ఐపీఎస్ లపై ఫిర్యాదు చేయించారన్న విజయసాయి
  • ఇంకో వంద ఫిర్యాదులు చేయించినా రిజల్ట్ మారదని వ్యాఖ్య
  • ప్రజలు జగన్ ను మరోసారి సీఎంగా చూడాలనుకుంటున్నారన్న విజయసాయి
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు. మీ న”మ్మక”స్తుడు నిమ్మగడ్డ రమేశ్‌తో వాలంటీర్లపై విషం చిమ్మించావని ఆయన విమర్శించారు. వదిన పురందేశ్వరితో 22 మంది ఐపీఎస్‌లపై ఫిర్యాదు చేయించింది మీరే కదా చంద్రబాబు గారూ అని ప్రశ్నించారు. వాళ్లంతా ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగులని, వాళ్ళ నైతిక స్థైర్యం దెబ్బతీసేలా దొంగ దెబ్బ కొడుతున్నా అనుకుంటున్నారేమో అని అన్నారు. 

ప్రజలు కొట్టబోయే దెబ్బకు మీ దిమ్మ తిరుగుతుందని చెప్పారు. మీకు ఇవే ఆఖరి ఎలక్షన్లు అని అన్నారు. మీరు ఇంకో వంద ఫిర్యాదులు చేయించినా ఫైనల్ రిజల్ట్ మాత్రం మారదని చెప్పారు. తీర్పు చెప్పాల్సిన ప్రజలు జగన్ గారిని మళ్లీ సీఎంగా చూడాలని నిర్ణయించుకున్నారని అన్నారు.


More Telugu News

Vijayasai Reddy Jagan YSRCP Chandrababu Telugudesam Daggubati Purandeswari BJP