ఎంపీ, సినీనటి నవనీత్ కౌర్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట
- 2019 లోక్ సభ ఎన్నికల్లో అమరావతి నుంచి ఇండిపెండెంట్ గా గెలుపొందిన నవనీత్ కౌర్
- ఆమెది నకిలీ క్యాస్ట్ సర్టిఫికెట్ అని శివసేన అభ్యర్థి పిటిషన్
- నవనీత్ క్యాస్ట్ సర్టిఫికెట్ ను రద్దు చేసిన బాంబే హైకోర్టు
2019 ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి లోక్ సభ స్థానం నుంచి నవనీత్ కౌర్ ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుపొందారు. శివసేన అభ్యర్థి ఆనందరావుపై ఆమె విజయం సాధించారు. ఈ క్రమంలో ఆమె నకిలీ ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికెట్ తో ఎన్నికల్లో పోటీ చేశారని ఆనందరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఆమెది నకిలీ కుల ధ్రువీకరణ పత్రం అని గుర్తించింది. ఆమె క్యాస్ట్ సర్టిఫికెట్ ను రద్దు చేయడంతో పాటు... రూ. 2 లక్షల జరిమానా విధించింది. దీంతో, ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు, ఈ ఎన్నికల్లో నవనీత్ కౌర్ బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. అమరావతి టికెట్ ను ఆమెకు బీజేపీ కేటాయించింది.