Pawan Kalyan: ఆటోలో ప్ర‌యాణించిన జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌

Janasena President Pawan Kalyan Travel in Auto
  • రోడ్డుషోలో భాగంగా కొండెవ‌రం వ‌ద్ద ఆటో ఎక్కిన జ‌న‌సేనాని
  • ఆటోలో దాదాపు రెండు కిలోమీట‌ర్ల మేర‌ ప్ర‌యాణించిన వైనం
  • పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నా.. ఓటేసి గెలిపించాల‌ని కోరిన ప‌వ‌న్‌

రోడ్డుషోలో భాగంగా జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆటో ఎక్కారు. కొండెవ‌రం వ‌ద్ద ఆటో ఎక్కిన జ‌న‌సేనాని దాదాపు రెండు కిలోమీట‌ర్ల మేర‌ ప్ర‌యాణించారు. ఈ సంద‌ర్భంగా 'నేను మీ ప‌వ‌న్ క‌ల్యాణ్‌. పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నాను. మీరంద‌రూ ఓటేసి న‌న్ను గెలిపించండి' అని జ‌న‌సేనాని ఓట‌ర్ల‌ను కోరారు. 

ఇక ఆటోలో ప్ర‌యాణిస్తున్న స‌మ‌యంలో అక్కడి రోడ్ల‌పై డ్రైవ‌ర్లు ఎదుర్కొంటున్న ఇక్క‌ట్ల విష‌య‌మై ఆటో డ్రైవ‌ర్ వ‌ద్ద‌ ఆరా తీశారు. ప్ర‌తి ఒక్క‌రి స‌మ‌స్యను తెలుసుకుంటాన‌ని, మీలో ఒక‌డిగా ఉంటూ కూట‌మి ప్రభుత్వం వ‌చ్చాక స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాన‌ని ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ భ‌రోసా ఇచ్చారు.
Pawan Kalyan
Janasena
AP Politics

More Telugu News