raghunandan rao: ఫోన్​ ట్యాపింగ్​ కేసులో వారినీ నిందితులుగా చేర్చాలి: బీజేపీ నేత రఘునందన్ రావు

  • కేసీఆర్‌, హరీశ్‌రావు, కేటీఆర్‌, వెంకట్రామిరెడ్డి పేర్లనూ కేసులో చేర్చాలని డిమాండ్ 
  • 2014 నుంచే విచారణ చేపట్టాలన్న రఘునందన్ 
  • కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అప్పుడు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్న 
phone tapping case

రాష్ర్టంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, హరీశ్‌రావు, కేటీఆర్‌, వెంకట్రామిరెడ్డి పేర్లనూ నిందితులుగా చేర్చాలని బీజేపీ నేత రఘునందన్ రావు డిమాండ్‌ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రఘునందన్‌ మాట్లాడారు.  ఈ అంశంలో హరీశ్‌రావు నాటకాలను ప్రజలు నమ్మబోరని ఆయన వ్యాఖ్యానించారు. 

అసలు ఫోన్‌ ట్యాపింగ్‌ ఉదంతంపై 2014 నుంచే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో రూ.3.5 కోట్లు పట్టుకున్నా.. నాటి కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎందుకు ఫిర్యాదు చేయలేదని రఘునందన్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఐపీఎస్ అధికారి స్టీఫెన్‌ రవీంద్ర చెప్పిన రూ. 30 కోట్లు ఎక్కడికి పోయాయని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో తాను చేసిన ఫిర్యాదుపై పోలీసులు, ఉన్నతాధికారులు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.

More Telugu News