Disha: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసు.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు

  • పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలన్న సిర్పూర్ కమిషన్
  • హైకోర్టును ఆశ్రయించిన పోలీసు అధికారులు
  • పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవద్దని స్టే విధించిన హైకోర్టు
TS high Court orders not to take  any action on Disha encounter police

దిశ హత్యాచారం ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుల ఎన్ కౌంటర్ అంశం కూడా హెడ్ లైన్స్ లో నిలిచింది. ఎన్ కౌంటర్ పై కోర్టులో కేసు నడుస్తోంది. ఎన్ కౌంటర్ పై సిర్పూర్ కమిషన్ కూడా ఏర్పాటయింది. ఈ కమిషన్ ను సుప్రీంకోర్టు నియమించింది. ఈ కమిషన్ నివేదిక కూడా ఇచ్చింది. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసు అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కమిషన్ సూచించింది. అయితే సిర్పూర్ కమిషన్ నివేదిక ఆధారంగా సదరు పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. కమిషన్ నివేదికపై ఏడుగురు పోలీసు అధికారులు, షాద్ నగర్ తహసీల్దార్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు... సదరు పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవద్దని స్టే విధించింది.

More Telugu News