జనసేన అధినేతకు స్వల్ప అస్వస్థత
- రెండు రోజులుగా జ్వరం, దగ్గుతో బాధపడుతున్న పవన్
- అయినా శనివారం ప్రచారంలో పాల్గొన్న వైనం
- షెడ్యూల్ ముందస్తుగా ఖరారు కావడంతో అనారోగ్యంతోనే ప్రచారం కొనసాగింపు
ఆదివారం శక్తిపీఠాన్ని సందర్శించుకున్న అనంతరం జనసేన-టీడీపీ-బీజేపీ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. శ్రేణులకు పలు సూచనలు చేశారు. అత్యవసర సమావేశం కోసం ఆదివారం సాయంత్రం హెలికాఫ్టర్లో హైదరాబాద్ కు వెళ్లిన పవన్ కల్యాణ్, సోమవారం ఉదయం మళ్లీ పిఠాపురం చేరుకుని మిగిలిన పర్యటన పూర్తి చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.