Pawan Kalyan: పిఠాపురం దత్తపీఠంలో పవన్ కల్యాణ్ పూజలు.. వీడియో ఇదిగో!

Janasena chief pawan kalyan second day campaign in Pithapuram
  • పవన్ రాకతో దత్తపీఠం వద్ద పెరిగిన రద్దీ
  • జేజీఆర్ ఆసుపత్రి ప్రారంభోత్సవం చేసిన జనసేనాని
  • రెండో రోజు కొనసాగిన ఎన్నికల ప్రచారం
పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం రెండో రోజు కొనసాగింది. ఆదివారం ఉదయం పవన్ కల్యాణ్ దత్తపీఠం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ రాక నేపథ్యంలో దత్త పీఠం వద్ద రద్దీ పెరిగింది. పిఠాపురంలో అత్యంత ప్రాచూర్యం పొందిన పురుహూతిక శక్తి పీఠం సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం బషీర్ బీబీ దర్గాను కూడా పవన్ సందర్శించారు. పిఠాపురంలో జేజీఆర్ ఆసుపత్రి ప్రారంభోత్సవం చేశారు. మరికాసేపట్లో పవన్ కల్యాణ్ జనసేన, టీడీపీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. 

వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నట్లు పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేనాని గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యకర్తలతో చర్చిస్తారని సమాచారం. ఇప్పటి నుంచే పిఠాపురంలో బూత్ లెవల్ కూటమి నేతలు కలిసి పనిచేసే విషయంపై చర్చ జరగనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వైసీపీ నేతల కుట్రలను ఎదుర్కొంటూ ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై పార్టీ నేతలకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేయనున్నట్లు జనసేన నేతలు చెప్పారు.
Pawan Kalyan
Janasena
Pithapuram
AP Assembly Polls
Dattapetham

More Telugu News