మహబూబాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సీతారాంనాయక్‌పై కేసు నమోదు
- నిన్న భద్రాచలం సీతారామచంద్రస్వామిని దర్శించుకున్న సీతారాంనాయక్
- మూలవిరాట్ ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన అనుచరులు
- తీవ్రంగా పరిగణించి పోలీసులకు ఫిర్యాదుచేసిన ఈవో రమాదేవి
మూలవిరాట్ ఫొటోలు తీయడం నిబంధనలకు విరుద్ధం కావడంతో ఆలయ ఈవో రమాదేవి దీనిని తీవ్రంగా పరిగణించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీతారాంనాయక్‌పై కేసు నమోదుచేసిన పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.