Komatireddy Venkat Reddy: బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్

Minister Komatireddy Venkat Reddy counter to Maheswar Reddy comments
  • మహేశ్వర్ రెడ్డి తనపై అసత్య ఆరోపణలు చేశారని ఆగ్రహం
  • మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీలో చేరుతానని మహేశ్వర్ రెడ్డే తమకు చెప్పారని ఆసక్తికర వ్యాఖ్యలు
  • మాకు మెజార్టీ ఉంది... అవసరం లేదని మహేశ్వర్ రెడ్డికి చెప్పానన్న మంత్రి
బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా స్పందించారు. మహేశ్వర్ రెడ్డి తనపై అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు. మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీలో చేరుతానని మహేశ్వర్ రెడ్డే తమకు చెప్పారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉందని... ఎవరి అవసరమూ లేదని తాను మహేశ్వర్ రెడ్డికి స్పష్టం చేశానన్నారు.

అంతకుముందు మహేశ్వర్ రెడ్డి... కోమటిరెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. సొంత తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డియే మంత్రితో టచ్‌లో లేకుండా పోయారని విమర్శించారు. భువనగిరి ఎంపీ టిక్కెట్ రాజగోపాల్ రెడ్డి భార్యకు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం చెబితే వెంకటరెడ్డి అడ్డుపడ్డారని ఆరోపించారు. నీకు, నీ తమ్ముడికే గొడవ అవుతుంటే ఇంకో పార్టీ నేతలు నీకు టచ్‌లో ఉన్నారా? అని ఎద్దేవా చేశారు.
Komatireddy Venkat Reddy
Komatireddy Raj Gopal Reddy
BJP
Maheshwar Reddy

More Telugu News