BJP: మా ఎమ్మెల్యేల్ని టచ్ చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 48 గంటల్లో కూలిపోతుంది: బీజేపీ శాసన సభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి వార్నింగ్

  • ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అవుతాననే భయం రేవంత్ రెడ్డికి ఉందన్న మహేశ్వర్ రెడ్డి
  • కాంగ్రెస్ ప్రజాస్వామ్యయుతంగా పాలన చేస్తే సహకరిస్తామని హామీ
  • ముఖ్యమంత్రి పదవిపై పది మంది మంత్రులు కన్నేశారని వ్యాఖ్య
  • విచారణల పేరుతో రేవంత్ రెడ్డి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణ
BJPLP Maheshwar Reddy warning to Revanth reddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూస్తే 48 గంటల్లో ప్రభుత్వం పడిపోతుందని బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరూ ఎవరికీ అమ్ముడుపోరన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తే మాత్రం ప్రభుత్వం ఉండదని హెచ్చరించారు. మేం కనుక గేట్లు తెరిస్తే కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్యయుతంగా పాలన చేస్తే సహకరిస్తామని స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డి వసూళ్ల చిట్టా తమ వద్ద ఉందన్నారు. హైదరాబాద్ డబ్బులను దేశ రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ వినియోగిస్తోందని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో తన ముఖ్యమంత్రి పదవి పోతుందనే భయం రేవంత్ రెడ్డికి ఉందని విమర్శించారు. సీఎం పదవిపై పదిమంది మంత్రులు కన్నేశారన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఇతర పార్టీల్లో చేరేవారిని రాళ్లతో కొట్టాలని గతంలో రేవంత్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. అలాంటప్పుడు ఇప్పుడు రాజీనామా చేయకుండానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటున్నారు? అని ప్రశ్నించారు. తాను షిండే అవుతానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గతంలో గడ్కరీతో అన్నారని... ఆయన చెప్పింది వాస్తవమేనని... తమ అధిష్ఠానంతో టచ్‌లో ఉన్నారని చెప్పారు.

విచారణల పేరుతో రేవంత్ రెడ్డి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి వసూళ్ల చిట్టా తమ వద్ద ఉందని తెలిపారు. ఆర్-ట్యాక్స్ కింద రూ.3వేల కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. తాను షిండే పాత్ర పోషిస్తానని గతంలో కోమటిరెడ్డి అన్నది వాస్తవమే అన్నారు. తమ్ముడి భార్యకు టిక్కెట్ రాకుండా చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఆరోపణలు గుప్పించారు.

More Telugu News