Joe Biden: నేను విమానం తలుపు పక్కన కూర్చోనుగా.. బోయింగ్ విమానాల్లో నాణ్యతా లోపాలపై జో బైడెన్ జోక్

  • బోయింగ్ విమానాల్లో ఇటీవల బయటపడుతున్న నాణ్యతా లోపాలు
  • విమానం 16 వేల ఎత్తున ఉండగా విరిగిపడిన విమానం తలుపు
  • మీ విమానం తలుపులు సరిగా బిగించారా? అన్న వ్యాఖ్యాత ప్రశ్నకు బైడెన్ సరదా సమాధానం
  • ఆ వెంటనే సర్దుకుని ఇలాంటి విషయాల్లో తమాషా చేయకూడదన్న అమెరికా అధ్యక్షుడు
American President Joe Biden Jokes About Turbulent Boeing

తాను విమానం తలుపుల వద్ద కూర్చోనని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ చమత్కరించారు. కొన్ని నెలల క్రితం అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానం అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్ నుంచి కాలిఫోర్నియాకు వెళ్తుండగా విమానం తలుపు ఊడి కిందపడింది. ఆ సమయంలో విమానం 16 వేల అడుగుల ఎత్తులో ఎగురుతోంది. అందులో 171 మంది ప్రయాణికులు ఉన్నారు. పడిపోయిన డోర్ పక్కనే ప్రయాణికులు ఉన్నప్పటికీ పెను ప్రమాదం తప్పింది. 

ఈ ఘటన తర్వాత విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది.  ఈ ఘటనకంటే ముందు కూడా బోయింగ్ విమానాల్లో భద్రతా పరమైన లోపాలు వెలుగుచూశాయి. దీంతో ఆందోళన వ్యక్తమైంది. అయితే, ఆ తర్వాత బోయింగ్ సంస్థ విమానాల్లో భద్రతా పరమైన చర్యలు చేపట్టింది. మరమ్మతులు చేసింది.

తాజాగా బైడెన్ ఓ టాక్‌ షోలో పాల్గొన్నారు. వ్యాఖ్యాత మాట్లాడుతూ.. మీరు న్యూయార్క్ వెళ్లేముందు మీ రవాణాశాఖ మంత్రి ఎయిర్‌ఫోర్స్ వన్ (అధ్యక్షుడు ప్రయాణించే విమానం) బోల్టులు సరిగా బిగించారా? అని ప్రశ్నించారు. దానికి బైడెన్.. తాను తలుపు వద్ద కూర్చోనని బదులిచ్చారు. ఆ వెంటనే సర్దుకుని తాను సరదాగా ఈ మాట అన్నానని, అయితే, ఇలాంటి విషయాల్లో తమాషా చేయకూడదని పేర్కొన్నారు.

More Telugu News