జీహెచ్ఎంసీ కార్మికులపై రాళ్ల దాడి.. వీడియో ఇదిగో!
- ఫుట్ పాత్ పై పెట్టిన కొబ్బరి బొండాల బండి తొలగింపుపై వివాదం
- వీడియో రికార్డు చేసి పోలీసులకు ఫిర్యాదు చేసిన సిబ్బంది
- వ్యాపారితో పాటు నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు
విధుల్లో భాగంగా జీహెచ్ఎంసీ సిబ్బంది శనివారం ఉదయం రాజేంద్రనగర్ లోని సులేమాన్ నగర్ లో క్లీనింగ్‌కు వెళ్లారు. రహదారి పక్కనే ఉన్న ఫుట్ పాత్ పై ఉన్న చిరు వ్యాపారులను ఖాళీ చేయించారు. ఈ క్రమంలోనే ఓ కొబ్బరి బొండాల వ్యాపారి జీహెచ్ఎంసీ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. ఖాళీ చేయాలని చెప్పినా వినకపోవడంతో కొబ్బరి బొండాల బండిని, కొబ్బరి బొండాలను ట్రాక్టర్ లో తరలించేందుకు సిబ్బంది ప్రయత్నించారు. దీంతో సహనం కోల్పోయిన సదరు వ్యాపారి రాళ్లు, ఇటుకలతో జీహెచ్ఎంసీ సిబ్బందిపై దాడి చేశాడు. జీహెచ్ఎంసీ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. దాడికి పాల్పడ్డ వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.