Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్టీ బృందం

Mumbai Leelavathi Hospital trusty meets CM Revanth Reddy
  • ముఖ్యమంత్రి నివాసంలో కలిసిన లీలావతి హాస్పిటల్ బృందం
  • ట్రస్టీ ప్రశాంత్ మెహతా ఆధ్వర్యంలో సీఎంతో భేటీ
  • అంతకుముందు, ముఖ్యమంత్రితో ఫ్రాన్స్ రాయబారి భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గురువారం ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్టీ బృందం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసింది. లీలావతి హాస్పిటల్ ట్రస్టీ ప్రశాంత్ మెహతా ఆధ్వర్యంలోని బృందం ముఖ్యమంత్రిని కలిసింది. అంతకుముందు, ఫ్రాన్స్ రాయబారి థియరీ మాథౌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు.

గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు

రేపు 29న గుడ్ ఫ్రైడే సంద‌ర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి క్రైస్తవ సోదరసోదరీమణులకు శుభాకాంక్ష‌లు తెలిపారు. శాంతి, కరుణ సందేశాలతో పాటు క్రీస్తు నేర్పిన సేవ, దయ, సోదర భావం ఇప్పటికీ ఎప్పటికీ మానవాళికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు. ఏసుక్రీస్తు త్యాగాల జ్ఞాపకంగా జరుపుకునే గుడ్ ఫ్రైడే వేడుకలను క్రైస్తవ సోదర సోదరీమణులందరూ ఘనంగా జరుపుకోవాలని పేర్కొన్నారు.
Revanth Reddy
Mumbai
Hospital

More Telugu News