Naveen Polisetty: హీరో నవీన్ పోలిశెట్టికి అమెరికాలో యాక్సిడెంట్?

Actor Naveen Polisetty met with accident in USA
  • ప్రస్తుతం అమెరికాలో ఉన్న నవీన్ పోలిశెట్టి
  • బైక్ పై వెళ్తుండగా స్కిడ్ అయిన నవీన్
  • రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ల సూచన
'జాతిరత్నాలు' ఫేమ్ నవీన్ పోలిశెట్టికి అమెరికాలో యాక్సిడెంట్ అయినట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నవీన్ అమెరికాలో ఉన్నారు. అమెరికా వీధుల్లో బైక్ పై వెళ్తున్న సమయంలో స్కిడ్ అయి ఆయన కింద పడిపోయినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో నవీన్ చేతికి ఫ్రాక్చర్ అయిందని చెపుతున్నారు. గాయం తీవ్రత కొంచెం ఎక్కువగా ఉండటంలో రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొంత కాలం పాటు షూటింగులకు నవీన్ దూరంగా ఉండబోతున్నారు. మరోవైపు ఈ వార్తపై నవీన్ లేదా ఆయన టీమ్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. 

ఇక అతని సినిమాల విషయానికి వస్తే, చివరిగా విడుదలైన నవీన్ చిత్రం 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. ఈ సినిమాలో అనుష్కతో కలిసి నవీన్ నటించాడు. పి.మహేశ్ బాబు నటించిన ఈ చిత్రం మంచి వసూళ్లనే రాబట్టింది. ప్రస్తుతం నవీన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. 
Naveen Polisetty
Tollywood
USA
Road Accident

More Telugu News