Bhupathiraju Srinivasa Varma: పార్టీ గుర్తుపై పడి భావోద్వేగానికి గురైన నర్సాపురం కూటమి అభ్యర్థి భూపతిరాజు.. వీడియో ఇదిగో

Narsapuram BJP Candidate Bhupathiraju Srinivasa Varma Video Viral
  • పొత్తులో భాగంగా బీజేపీకి దక్కిన నర్సాపురం
  • భూపతిరాజు శ్రీనివాసవర్మకు టికెట్ ఇచ్చిన బీజేేపీ
  • 30 ఏళ్ల కష్టానికి ఫలితం దక్కిందంటూ భావోద్వేగం
నర్సాపురం బీజేపీ-టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ భావోద్వేగానికి గురయ్యారు. తనకు టికెట్ దక్కినందుకు సంతోషం పట్టలేకపోయారు. పొత్తులో భాగంగా నర్సాపురం పార్లమెంటు టికెట్‌‌‌ను బీజేపీకి కేటాయించారు. ఆ స్థానాన్ని బీజేపీ శ్రీనివాసవర్మకు కేటాయించింది. మూడు దశాబ్దాలుగా పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న ఆయన తనకు టికెట్ దక్కడంపై తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 

30 ఏళ్ల కష్టానికి దక్కిన ఫలితం అంటూ పార్టీ కార్యాలయం వద్దనున్న బీజేపీ, కమలం పార్టీ గుర్తుపై పడి కాసేపు అలాగే ఉండిపోయారు. అభిమానులు, కార్యకర్తలు కాసేపటి తర్వాత ఆయనను బలవంతంగా లేపాల్సి వచ్చింది. ఈ సందర్భంగా వారు జై బీజేపీ, జై శ్రీనివాసవర్మ అంటూ నినాదాలు చేశారు.
Bhupathiraju Srinivasa Varma
Narsapuram
BJP
Janasena
Telugudesam

More Telugu News