Rohit Sharma: ఐపీఎల్ లో రోహిత్ శర్మ అరుదైన ఘనత

Rohit Sharma 200th match for MI in IPL
షార్ట్స్‌లో చూడండి
ముంబయి ఇండియన్స్ మాజీ సారథి రోహిత్ శర్మ ఐపీఎల్  లో అరుదైన ఘనత అందుకున్నాడు. ముంబయి ఇండియన్స్ తరఫున 200 మ్యాచ్ లలో బరిలో దిగిన ఆటగాడిగా రికార్డు పుటల్లో స్థానం దక్కించుకున్నాడు. తద్వారా, ఐపీఎల్ లో ఓ జట్టు తరఫున 200 మ్యాచ్ లు ఆడిన మూడో ఆటగాడిగా నిలిచాడు. 

రోహిత్ శర్మ కంటే ముందు ఈ ఘనతను ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ సాధించారు. ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ 200 మ్యాచ్ లు ఆడగా, కోహ్లీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున 200 మ్యాచ్ లు ఆడాడు. ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో రోహిత్ కూడా ధోనీ, కోహ్లీ సరసన చేరాడు. 

మొత్తమ్మీద రోహిత్ శర్మకు ఇది 245వ ఐపీఎల్ మ్యాచ్. రోహిత్ శర్మ గతంలో డెక్కన్ చార్జర్స్ ఫ్రాంచైజీకి ఆడిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Rohit Sharma
200th Match
Mumbai Indians
IPL

More Telugu News