IPL 2024: ఉప్ప‌ల్‌లో మ్యాచ్.. మెట్రోరైలు స‌మ‌యం పొడిగింపు

Hyderabad Metro Rail Timing Extended due to IPL Match in Uppal
  • ఇవాళ్టి మ్యాచ్ సంద‌ర్భంగా మెట్రో రైళ్లు నిర్ణీత స‌మయానికి మించి న‌డుస్తాయ‌న్న‌ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి 
  • చివ‌రి మెట్రో రైళ్లు రాత్రి 12.15 గంట‌ల‌కు బ‌య‌ల్దేరి 1.10 గంట‌లకు గ‌మ్యస్థానాల‌కు చేరుకుంటాయ‌ని ప్ర‌క‌ట‌న‌
  • రాత్రి 7.30 గంట‌ల‌కు ప్రారంభం కానున్న ఎస్ఆర్‌హెచ్‌, ఎంఐ మ్యాచ్
మ‌రికొన్ని గంట‌ల్లో ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌), ముంబై ఇండియ‌న్స్ (ఎంఐ) మ‌ధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలో మ్యాచ్ చూసేందుకు ఉప్ప‌ల్‌కు వ‌చ్చే క్రికెట్ అభిమానుల‌కు హైద‌రాబాద్ మెట్రో తీపి క‌బురు చెప్పింది. ఐపీఎల్ మ్యాచ్ సంద‌ర్భంగా ఉప్ప‌ల్ మార్గంలో మెట్రోరైలు స‌మ‌యం పొడిగించింది. బుధ‌వారం మెట్రో రైళ్లు నిర్ణీత స‌మయానికి మించి న‌డుస్తాయ‌ని మేనేజింగ్ డైరెక్ట‌ర్ (ఎండీ) ఎన్‌వీఎస్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. 

చివ‌రి మెట్రో రైళ్లు వాటి టెర్మిన‌ల్ నుంచి రాత్రి 12.15 గంట‌ల‌కు బ‌య‌ల్దేరి 1.10 గంట‌లకు త‌మ గ‌మ్యస్థానాల‌కు చేరుకుంటాయ‌ని ప్ర‌క‌టించింది. నాగోల్‌, ఉప్ప‌ల్‌, స్టేడియం అండ్ ఎన్‌జీఆర్ఐ స్టేష‌న్‌ల‌లో మాత్ర‌మే ప్ర‌వేశం ఉంటుంద‌ని వెల్ల‌డించింది. ఇక రాత్రి 7.30 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌య్యే ఎస్ఆర్‌హెచ్‌, ఎంఐ మ్యాచ్ కోసం ఇప్ప‌టికే అంతా సిద్ధ‌మైంది. మ్యాచుకు 3 గంట‌ల ముందు నుంచే ప్రేక్ష‌కుల‌ను స్టేడియం లోప‌లికి పంపించ‌నున్నారు.
IPL 2024
Hyderabad Metro Rail
Uppal Stadium
SRH
Mumbai Indians

More Telugu News