Allu Arjun: రామ్ చ‌ర‌ణ్‌కు అల్లు అర్జున్ స్పెష‌ల్ బ‌ర్త్ డే విషెస్

  • చెర్రీకి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ స్పెష‌ల్ వీడియో పోస్ట్ చేసిన బ‌న్నీ
  • వీడియోలో అల్లు అర్జున్‌, చ‌ర‌ణ్‌ ఇద్ద‌రు క‌లిసి డ్యాన్స్ చేస్తున్న వైనం 
  • యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న‌ 'గేమ్ చేంజ‌ర్' సాంగ్‌
Allu Arjun Special Birth Day Wishes to Ramcharan

ఇవాళ‌ (మార్చి 27) గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. వివిధ రంగాల‌కు చెందిన ప్రముఖులు చెర్రీకి బ‌ర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. ఇప్ప‌టికే సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు చ‌ర‌ణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేయ‌గా.. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా మెగా ప‌వ‌ర్ స్టార్‌కు బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ ఓ స్పెష‌ల్ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియోకు బ‌న్నీ.. హ్యాపీ బ‌ర్త్ డే మై మోస్ట్ స్పెష‌ల్ క‌జిన్‌.. ల‌వ్ యూ అనే క్యాప్ష‌న్‌ను జోడించాడు.    

ఈ వీడియో కాస్తా ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోలో బ‌న్నీ, చెర్రీ ఏదో ఈవెంట్‌లో ఇద్ద‌రు క‌లిసి డ్యాన్స్ చేస్తున్న‌ట్లు ఉంది. దీనిపై మెగా అభిమానులు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు. ఇదిలాఉంటే.. చ‌ర‌ణ్ బర్త్ డే సంద‌ర్భంగా వ‌చ్చిన గేమ్ చేంజ‌ర్ మూవీలోని 'జ‌ర‌గండి' పాట యూట్యూబ్‌లో దుమ్ముదులుపుతోంది. గేమ్ చేంజ‌ర్ మూవీని భారీ చిత్రాల ద‌ర్శ‌కుడు శంక‌ర్ తెర‌కెక్కిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై చెర్రీ ఫ్యాన్స్ భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. 

గేమ్ చేంజ‌ర్‌తో పాటు ఇటీవ‌లే ఉప్పెన ఫేం బుచ్చిబాబుతో ఒక సినిమాను చ‌ర‌ణ్ ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఈ రెండు చిత్రాల‌తో పాటు సుకుమార్‌తో కూడా ఒక సినిమా చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ తాజాగా ప్ర‌క‌టించింది. అటు అల్లు వారబ్బాయి కూడా పుష్ప‌-2తో బిజీగా ఉన్నాడు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం ఆగ‌స్టు 15న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం బ‌న్నీ దుబాయి టూర్‌లో ఉన్నాడు. అక్క‌డ మేడ‌మ్ టుస్సాడ్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైన‌పు విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌నున్నాడు.

More Telugu News