Ramcharan: రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' నుంచి బిగ్ అనౌన్స్ మెంట్

  • చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో 'గేమ్ ఛేంజర్' మూవీ
  • రేపు రామ్ చరణ్ పుట్టినరోజు
  • రేపు ఉదయం 9 గంటలకు 'జరగండి జరగండి' సాంగ్ విడుదల
Jaragandi song from Ram Charan movie Game Changer releasing tomorrow

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో 'గేమ్ ఛేంజర్' మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ నుంచి బిగ్ అనౌన్స్ మెంట్ వచ్చింది. 'జరగండి జరగండి' పాటను రేపు రిలీజ్ చేస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా మేకర్స్ ప్రకటించారు. రేపు ఉదయం 9 గంటలకు సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించారు. రేపు రామ్ చరణ్ పుట్టిన రోజు కూడా కావడం గమనార్హం. చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని పాటను విడుదల చేస్తున్నారు. పాటకు సంబంధించి పోస్టర్ ను విడుదల చేశారు. 150 థియేటర్స్ లో ఈ పాటను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.

'గేమ్ ఛేంజర్'లో చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటిస్తోంది. ఇతర ప్రధాన పాత్రలను అంజలి, శ్రీకాంత్, ఎస్ జే సూర్య, సముద్రఖని, నవీన్ చంద్ర తదితరులు పోషిస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా... తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.

More Telugu News