Dara Padmaja: షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య కుమార్తె

Former MLA Dara Sambaiah daughter Dara Padmaja joinc Congress

  • నేడు కాంగ్రెస్ పార్టీలో పలువురి చేరిక
  • పార్టీ కండువా కప్పిన పీసీసీ చీఫ్ షర్మిల
  • వైసీపీ నాయకత్వంతో విసుగుచెంది కాంగ్రెస్ లోకి వచ్చారని వెల్లడి

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య కుమార్తె దారా పద్మజ నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దారా పద్మజకు నేడు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ విషయాన్ని షర్మిల ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇంకా మరికొందరు వైసీపీ నేతలు కూడా నేడు కాంగ్రెస్ లో చేరారు.

"వైసీపీ నాయకత్వం నిరంకుశ ధోరణితో విసుగు చెంది ఇవాళ కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎంతో సంతోషంతో వారికి స్వాగతం పలుకుతున్నాను. నంద్యాల జడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డి, సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య కుమార్తె దారా పద్మజ, ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ ఎస్టీ సెల్ ఇన్చార్జి సృజన నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి వారు కృషి చేస్తారు. ఏపీ ప్రజల సంక్షేమం కోసం వారు కాంగ్రెస్ పార్టీతో కలిశారు" అని షర్మిల వివరించారు.

Dara Padmaja
Congress
Sharmila
Dara Sambaiah
  • Loading...

More Telugu News