TATA IPL 2024 Schedule: ఐపీఎల్ 2024 పూర్తి షెడ్యూల్ వ‌చ్చేసింది.. ఫైనల్ ఎప్పుడంటే..!

  • ఏప్రిల్ 8 నుంచి మే 19వ తేదీ వ‌ర‌కు లీగ్ మ్యాచులు
  • మే 21న క్వాలిఫ‌య‌ర్-1, మే 22న‌ ఎలిమినేట‌ర్‌, మే 24వ తేదీన క్వాలిఫ‌య‌ర్‌-2 
  • మే 26వ‌ తేదీన చెన్నై వేదిక‌గా ఫైన‌ల్‌  
The complete TATA IPL 2024 schedule Released

బీసీసీఐ సోమ‌వారం ఐపీఎల్  2024 పూర్తి షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది. ఇంత‌కుముందు సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఏప్రిల్ 7వ తేదీ వ‌ర‌కు మాత్ర‌మే షెడ్యూల్ ఇచ్చింది. తాజాగా మిగ‌తా షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్ర‌కారం ఏప్రిల్ 8 నుంచి మే 19వ తేదీ వ‌ర‌కు లీగ్ మ్యాచులు జ‌రుగుతాయి. మే 21న క్వాలిఫ‌య‌ర్-1, మే 22వ తేదీన‌ ఎలిమినేట‌ర్‌, మే 24వ తేదీన క్వాలిఫ‌య‌ర్‌-2 జర‌గ‌నున్నాయి. ఇక ఫైన‌ల్ వ‌చ్చేసి మే 26న జరుగ‌నుంది. ఇందులో క్వాలిఫ‌య‌ర్-1, ఎలిమినేట‌ర్ మ్యాచుల‌కు అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వ‌నుంది. అలాగే క్వాలిఫ‌య‌ర్‌-2తో పాటు ఫైన‌ల్ మ్యాచ్ చెన్నైలో జ‌రుగుతుంది.  
  
పూర్తి షెడ్యూల్ ఇలా..

More Telugu News