AAP: నీలికళ్ల అబ్బాయి చద్దా బ్రిటన్ ఎంపీ ప్రీత్ గిల్‌ను ఎందుకు కలిశారు?: కేజ్రీవాల్ భార్యకు బీజేపీ నేత ప్రశ్న

Why Raghav Chadha met UK MP in London BJP asks Sunita Kejriwal
  • కేజ్రీవాల్ సందేశాన్ని చదివి వినిపించిన భార్య సునీత కేజ్రీవాల్
  • వేర్పాటువాదాన్ని సమర్థించే బ్రిటన్ ఎంపీని రాఘవ్ చద్దా ఎందుకు కలిశారో చెప్పాలని ప్రశ్న
  • బ్రిటన్ మహిళా ఎంపీతో రాఘవ్ చద్దా ఉన్న ఫొటోను షేర్ చేసిన బీజేపీ నేత అమిత్ మాలవీయ
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా బ్రిటన్‌లో అక్కడి ఎంపీ ప్రీత్ కె గిల్‌ను ఎందుకు కలిశారు? ఆ బ్రిటన్ ఎంపీ బాహాటంగా వేర్పాటువాదాన్ని సమర్థిస్తున్నారు కదా... అలాంటప్పుడు ఎలా కలిశారు? అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత‌‌ను బీజేపీ ఐటీ సెల్ చీఫ్ ఆమిత్ మాలవీయ శనివారం ప్రశ్నించారు.

భారత్ దేశం లోపల, వెలుపల దేశాన్ని బలహీనపరిచే శక్తులు ఉన్నాయని... మనం అప్రమత్తంగా ఉండాలని, ఈ శక్తులను ఓడించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన సందేశాన్ని ఆయన భార్య సునీత చదివి వినిపించారు. ఈ వ్యాఖ్యలకు అమిత్ మాలవీయ కౌంటర్ ఇచ్చారు. ఆమె వాదనతో పూర్తిగా అంగీకరిస్తున్నాను... కానీ యూకేలో మీ ఎంపీ వేర్పాటువాదాన్ని సమర్థించే ఎంపీతో ఎందుకు కలిశారో చెప్పాలని నిలదీశారు.

బ్రిటిష్ లేబర్ పార్టీ ఎంపీ కే గిల్ వేర్పాటువాదాన్ని బహిరంగంగా సమర్థిస్తుంటారని, హింసాత్మక సంఘటనలకు నిధులు సమకూరుస్తారని, లండన్‌లోని ఇండియా హౌస్ వెలుపల నిరసనలకు మద్దతుగా నిలుస్తారని, భారత వ్యతిరేక, మోదీ వ్యతిరేక సోషల్ మీడియా ఖాతాలను నిరంతరం పోస్ట్ చేస్తారన్నారు. 

భారత్‌లో లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది... కానీ కేజ్రీవాల్ నీలికళ్ల అబ్బాయి రాఘవ్ చద్దా మాత్రం లండన్‌లో ఉన్నాడు... ఎందుకు? ప్రీత్ గిల్‌తో చద్దా ఎందుకు టచ్‌లో ఉన్నాడు? అంటూ వారిద్దరూ కలిసిన ఫోటోను ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ ప్రశ్నించారు. కాగా, కవిత, కేజ్రీవాల్ తర్వాత అరెస్ట్ కాబోయేది రాఘవ్ చద్దా కావొచ్చునని ఇటీవల సీనియర్ లాయర్ కపిల్ సిబాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
AAP
BJP
Arvind Kejriwal
Delhi Liquor Scam

More Telugu News