SRH: టాస్ గెలిచిన సన్ రైజర్స్ కొత్త సారథి ప్యాట్ కమిన్స్

SRH won the toss and chose bowling in their inaugural match
  • ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు
  • రెండో మ్యాచ్ లో సన్ రైజర్స్ వర్సెస్ కోల్ కతా
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
ఐపీఎల్-2024 సీజన్ ను సరికొత్తగా ఆరంభించాలని సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఆశిస్తోంది. ఆ జట్టు ఇవాళ తమ తొలి మ్యాచ్ ను కోల్ కతా నైట్ రైడర్స్ తో ఆడనుంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం ఈ పోరుకు వేదికగా నిలవనుంది. 

టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్యాట్ కమిన్స్ ను సన్ రైజర్స్ యాజమాన్యం ఐపీఎల్ లో చరిత్రలోనే రెండో అత్యధిక ధర రూ.20.50 కోట్లతో వేలంలో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 

గత కొన్ని సీజన్లుగా సన్ రైజర్స్ ఆటతీరు నానాటికీ తీసికట్టు అన్నట్టుగా మారిన నేపథ్యంలో, కమిన్స్ సారథ్యంలో తమ భాగ్యరేఖ మారుతుందని ఆ జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. 

సన్ రైజర్స్ హైదరాబాద్: ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ఐడెన్ మార్ క్రమ్, రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో యన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టి.నటరాజన్.

కోల్ కతా నైట్ రైడర్స్: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా, రింకూ సింగ్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, రమణ్ దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.
SRH
Pat Cummins
Toss
KKR
IPL-2024

More Telugu News