టెట్ పరీక్ష ఫీజుపై సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ లేఖ

BRS Balka Suman letter to CM Revanth Reddy
  • టెట్ పరీక్ష ఫీజును తగ్గించాలని కోరిన బాల్క సుమన్
  • గతంలో రూ.100, రూ.200 ఉన్న ఫీజు ఇప్పుడు రూ.1000, రూ.2000కు పెంచారన్న బీఆర్ఎస్ నేత
  • అలాగే పరీక్ష నిర్వహణ 11 జిల్లా కేంద్రాల్లో కాకుండా 33 జిల్లా కేంద్రాల్లో నిర్వహించాలని విజ్ఞప్తి
టెట్ పరీక్ష ఫీజును తగ్గించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ శనివారం బహిరంగ లేఖ రాశారు. పరీక్ష ఫీజు తగ్గించడం ద్వారా నిరుపేద అభ్యర్థులపై భారం తగ్గించాలన్నారు. టెట్ పరీక్ష నిర్వహణకు 33 జిల్లాల్లోనూ కేంద్రాలు ఇవ్వాలని కోరారు. గతంలో టెట్ పరీక్ష ఫీజు ఒక పేపర్‌కి రూ.200, రెండు పేపర్లకు రూ.300 ఉండేదని... కానీ ఇప్పుడు ఒక పేపర్‌కి రూ.1000, రెండు పేపర్లకు రూ.2000 పెంచడం వల్ల నిరుపేద అభ్యర్థులపై భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే పరీక్ష నిర్వహణ 11 జిల్లా కేంద్రాల్లోనే కాకుండా 33 జిల్లా కేంద్రాల్లో నిర్వహించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. 11 జిల్లాల్లోనే కేంద్రాలు ఏర్పాటు చేస్తే మిగతా జిల్లాల విద్యార్థులు ఇబ్బందులు పడతారని తెలిపారు. వారికి దూరాభారంతో పాటు ఆర్థికభారం కూడా అవుతుందన్నారు. కాబట్టి 7 లక్షల మంది నిరుద్యోగుల సమస్యను అర్థం చేసుకొని ఫీజులు తగ్గించాలని, పరీక్ష కేంద్రాలను 33 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని కోరారు.
Go Back to Shorts
BRS
Balka Suman
Revanth Reddy
Congress
TS TET
Telangana

More Telugu News