Vijay Devarakonda: ఆరోగ్యంగా ఉంటే డబ్బు అదే వస్తుంది .. తెలుగు ఫిల్మ్ జ‌ర్న‌లిస్ట్ అసోసియేష‌న్‌ హెల్త్ కార్డ్స్ పంపిణీలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌!

  • రెండు దశాబ్దాలు పూర్తిచేసుకున్న TFJA 
  • ఈ సందర్భంగా జరిగిన హెల్త్ కార్డుల పంపిణి 
  • తనకి జర్నలిస్టులు ఎంతో సహకరించారన్న విజయ్ దేవరకొండ
  • జర్నలిజం మారిపోతోందన్న దిల్ రాజు 
  • రాసేటప్పుడు ఆలోచించాలంటూ ఆర్ నారాయణమూర్తి రిక్వెస్ట్

TFJA Special

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(TFJA).. సభ్యుల సంక్షేమం నిరంతరం కృషి చేస్తోన్న సంఘం. ఈ ఏడాదిలో అసోషియేష‌న్ రెండు ద‌శాబ్దాల‌ను పూర్తి చేసుకుంది. అసోషియేష‌న్ సభ్యుల ఆరోగ్యం, కుటుంబ సభ్యుల బాగోగులను చూస్తూ ప్రతి సంఘ సభ్యుడికీ ఇంటి పెద్దలా అండగా నిలుస్తూ వస్తోంది టిఎఫ్‌జేఏ. ఇందులో చేరిన ప్రతి సభ్యుడికి రూ. 5 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం, అలాగే సభ్యుల కుటుంబాలకు మరో రూ.5 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం ఉంటుంది. అలాగే టర్మ్ పాలసీ విష‌యానికి వ‌స్తే స‌భ్యుడికి రూ.15 ల‌క్ష‌లు, యాక్సిడెంటల్ పాలసీ స‌భ్యుడికి రూ.25 ల‌క్ష‌ల‌ను అందేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. ఇందుకోసం పరిశ్రమ సహాయ సహకారాలతో పాటు అందరు సభ్యుల తోడ్పాటును తీసుకుంటోంది. 

ఈ యేడాది (2024-25) వరకూ సభ్యత్వం తీసుకున్న వారికి గుర్తింపు కార్డులతో పాటు, హెల్త్ కార్డ్స్ ను అందించడం జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి, స్టార్ ప్రొడ్యూస‌ర్‌ దిల్ రాజు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, టీఎఫ్‌జెఎ అధ్య‌క్షుడు ల‌క్ష్మీ నారాయ‌ణ‌, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ వై.జె.రాంబాబు, ట్రెజ‌ర‌ర్ సురేంద్ర నాయుడు స‌హా అసోసియేష‌న్ స‌భ్యులు.. జ‌ర్న‌లిస్ట్‌లు పాల్గొన్నారు. 

TFJA ట్రెజ‌ర‌ర్ సురేంద్ర నాయుడు మాట్లాడుతూ "20 ఏళ్లు స‌క్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నాం. ఇది మ‌న యూనిటీ. మ‌నం క‌లిసిమెలిసి ఇంత‌దాకా రాగ‌లిగాం. మ‌నం సాధించాల్సిన విష‌యాలు ఇంకా చాలా ఉన్నాయి. టీఎఫ్‌జేఏకి వెన్నంటి ఉంటూ మ‌న‌ల్ని న‌డిపిస్తున్న మెగాస్టార్ చిరంజీవిగారికి ధ‌న్య‌వాదాలు చెప్పుకోవాలి. ఇప్పుడు 181 మంది స‌భ్యులం ఉన్నాం. ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రూ క‌లిపి 481 మంది ఉన్నాం. 

కోవిడ్ టైమ్‌లో అసోసియేష‌న్ ద్వారా రెండు సార్లు గ్రాస‌రీస్ అంద‌జేశాం. ఇవాళ మెడిక‌ల్ ఇన్య్సూరెన్స్ ప్ర‌తి వ్య‌క్తికీ 10 ల‌క్ష‌ల‌ను అందిస్తున్నాం. అందులో 5 ల‌క్ష‌లు మెంబ‌ర్‌కి, 5 ల‌క్ష‌లు ఫ్యామిలీకి ఇస్తున్నాం. ఇందులో స‌గం మెంబ‌ర్ క‌ట్టుకుంటే, స‌గం అసోసియేష‌న్ భ‌రిస్తోంది. అలాగే ట‌ర్మ్ పాల‌సీ ప్ర‌తి స‌భ్యుడికీ 15 ల‌క్ష‌లు ప్ర‌తి ఏడాదీ ఇస్తున్నాం.  25 ల‌క్ష‌ల రూపాయ‌లు యాక్సిడెంట‌ల్ పాల‌సీని అందిస్తున్నాం. జ‌ర‌గ‌రానిది జ‌రిగితే, వారి కుటుంబానికి 25 ల‌క్ష‌లు వెళ్తుంది. ఆఫీసుల‌కు వెళ్ల‌లేని ప‌రిస్థితుల్లో ఉంటే వారి శాల‌రీ మేరకు 70 శాతం 16 నెల‌లపాటు అందిస్తాం" అన్నారు.

హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ మాట్లాడుతూ .. "జ‌ర్న‌లిస్టుల‌కు శ్రీనివాస‌రెడ్డిగారు ల్యాండ్‌లు ఇప్పిస్తే, అంద‌రూ ఆనందంగా ఉంటారు. జ‌ర్న‌లిస్టుల హెల్త్ కార్డుల సెల‌బ్రేష‌న్‌లో నేను పాల్గొన‌డం చాలా ఆనందంగా ఉంది. శ్రీనివాస‌రెడ్డిగారు ఇన్ని మాట్లాడుతుంటే నాకు చాలా విష‌యాలు తెలిశాయి. ఆయ‌న చాలా స్ట్రాంగ్ గైడ్ అనిపిస్తోంది. నా కెరీర్ మొద‌టి నుంచీ జ‌ర్న‌లిస్టులు నాతోనే ఉన్నారు. నేను కాలేజ్‌లో ఉన్న‌ప్పుడు మెడిక‌ల్ బిల్లులు ఎక్కువ వ‌స్తాయేమోన‌ని భ‌య‌ప‌డి హెల్త్ ఇన్‌స్యూరెన్స్ లు తీసుకునేవాడిని. వాటిని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో కూడా తెలిసేది కాదు. కొన్నిసార్లు రెన్యువ‌ల్‌కి డ‌బ్బులు ఉండేవి కాదు. అలా ఎన్నిటినో వ‌దిలేశాను. 

ఇప్పుడు ఈ అసోసియేష‌న్ ద్వారా అంద‌రూ యుటిలైజ్ చేసుకుంటున్నార‌ని తెలిసి ఆనందంగా అనిపించింది. జీవితంలో ఎవ‌రికైనా మూడే ముఖ్యం. ఒక‌టి ఆరోగ్యం, రెండు ఆనందం, మూడు డ‌బ్బు. ఈ మూడిటిలో ఏది ఉన్నా, ఇంకోటి ఉంటుంది. ఉండి తీరుతుంది. జీవితంలో ఈ మూడు ఉంటాయి. అంద‌రూ ఆరోగ్యం జాగ్ర‌త్త‌గా చూసుకోండి. నేను మీతో సుదీర్ఘ ప్ర‌యాణం చేస్తాను అని అన్నారు.

నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ `యూనియ‌న్‌కి పిల‌వ‌డం చాలా ఆనందంగా ఉంది. చాలా టైట్‌లో ఉన్నా. హెల్త్ కోసం ఇవాళ తెలుగు ఫిల్మ్ జ‌ర్న‌లిస్టులు చేస్తున్న ఈ కార్య‌క్ర‌మం చూస్తుంటే ఆనందంగా ఉంది. ఇందాక శ్రీనివాస‌రెడ్డిగారు నిజాయ‌తీగా ఓ మాట చెప్పారు. జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్న‌ప్పుడు మ‌నం చేసేది, రాసేది సొసైటీకి ఉప‌యోగ‌ప‌డాల‌ని అన్నారు. కాల‌క్ర‌మేణ జ‌ర్న‌లిజం కూడా మారిపోతూ వ్యాపార‌మైపోయింది. అంద‌రూ బావుండాలి .. వ్యాపారం చేయాలి. కానీ జ‌ర్న‌లిస్టుగా రాసే ప‌దం చాలా ముఖ్యం. సెల్‌ఫోన్ల‌ను నొక్కుతున్నారు కాబ‌ట్టి, కాస్త జాగ్ర‌త్త‌గా చూసి నొక్కితే పాజిటివ్ వైబ్ ఉంటుంది" అన్నారు.  

పీపుల్స్ స్టార్ ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి మాట్లాడుతూ జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల‌ను ఫ్రీగా ఇప్పించండి. స్థ‌లాల‌ను రేవంత్‌రెడ్డిగారిని అడ‌గండి. ఇళ్లు మీరు క‌ట్టుకోండి. శ్రీనివాస‌రెడ్డిగారు స్థ‌లాల‌ను ఇప్పించి పుణ్యం క‌ట్టుకోవాలి. తుపాకి క‌న్నా క‌లానికి భ‌య‌ప‌డ‌తాన‌ని అన్నారు నెపోలియ‌న్‌. ఎంతో మంది జ‌ర్న‌లిస్టులను క‌న్న‌ది సినిమా త‌ల్లి. ఆ రోజుల్లో వారం రోజుల‌కు త‌ర్వాతే రివ్యూలు రాసేవారు. కానీ ఇప్పుడు మార్నింగ్ షోకే రాస్తున్నారు. ఇవాళ సినిమా మూడు రోజులే బ‌తుకుతోంది. సినిమా గురించి రాస్తున్నప్పుడు ఆలోచించి రాయండి" అన్నారు. 

More Telugu News