IPL-2024: ఐపీఎల్-2024: ప్రారంభ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు

RCB won the toss in IPL 2024 inaugural match
షార్ట్స్‌లో చూడండి
ఐపీఎల్-2024 సీజన్ కు తెర లేచింది. ఇవాళ తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అమీతుమీకి సిద్ధమయ్యాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుంది. 

ఈ మ్యాచ్ ద్వారా చెన్నై జట్టు కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో తాజా సీజన్ ను ఆరంభిస్తోంది. ఇక, ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ విధ్వంసక ఆటగాడు రచిన్ రవీంద్ర చెన్నై టీమ్ ద్వారా ఐపీఎల్ అరంగేట్రం చేస్తున్నాడు. కివీస్ కు చెందిన మరో డాషింగ్  క్రికెటర్ డారిల్ మిచెల్ కూడా ఈసారి సీఎస్కే జట్టుకు ఆడుతున్నాడు. 

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, మహేంద్ర సింగ్ ధోనీ (వికెట్ కీపర్), దీపక్ చహర్, మహీశ్ తీక్షణ, ముస్తాఫిజూర్ రెహ్మాన్, తుషార్ దేశ్ పాండే.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, గ్లెన్ మ్యాక్స్ వెల్, కామెరాన్ గ్రీన్, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), అనుజ్ రావత్, కర్ణ్ శర్మ, అల్జారీ జోసెఫ్, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్.
Go Back to Shorts
IPL-2024
RCB
Toss
CSK
India

More Telugu News