KCR: కేజ్రీవాల్, కవిత అరెస్ట్‌లపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం

  • కేజ్రీవాల్ అరెస్ట్ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు అని వ్యాఖ్య
  • ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే ఏకైక లక్ష్యంతో బీజేపీ పని చేస్తోందని విమర్శ
  • మొన్న హేమంత్ సోరెన్, నిన్న కవిత, నేడు కేజ్రీవాల్ అరెస్ట్‌లు ఇందుకు నిదర్శనమన్న కేసీఆర్
KCR responds on Kejriwal and Kavitha arrest

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం స్పందించారు. కేజ్రీవాల్ అరెస్ట్ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు అన్నారు. ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే ఏకైక లక్ష్యంతో బీజేపీ పని చేస్తోందని విమర్శించారు. మొన్న హేమంత్ సోరెన్, నిన్న కవిత, నేడు కేజ్రీవాల్ అరెస్ట్‌లు ఇందుకు నిదర్శనం అన్నారు.

ఈడీ, సీబీఐ, ఐటీ స‌హా ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను కేంద్రం పావులుగా వాడుకుంటోంద‌ని ఆరోపించారు. ప్ర‌జాస్వామ్యానికి గొడ్డ‌లి పెట్టుగా ప‌రిణ‌మిస్తున్న కేంద్రం చ‌ర్య‌ల‌ను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ రాజ‌కీయ ప్రేరేపిత‌మైన అరెస్ట్ అని... అక్ర‌మ కేసుల‌ను వెంట‌నే వెనక్కి తీసుకొని, అరెస్ట్ చేసిన వారిని వెంట‌నే విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు.

More Telugu News