పిఠాపురం నుంచే ప్రచారానికి శ్రీకారం చుట్టాలని పవన్ కల్యాణ్ నిర్ణయం
- పిఠాపురం అసెంబ్లీ బరిలో దిగుతున్న పవన్ కల్యాణ్
- ఈ ఉదయం జనసేన నేతలతో పవన్ సమావేశం
- పిఠాపురం కేంద్రంగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం సాగించాలని నిర్ణయం
- ఇకపై పిఠాపురం నుంచే రాకపోకలు
పిఠాపురం నియోజవకర్గంలోనే మూడ్రోజులు ప్రచారం నిర్వహించనున్న పవన్ కల్యాణ్... పిఠాపురం కేంద్రంగానే రాష్ట్ర స్థాయిలో ప్రచారాన్ని పర్యవేక్షించనున్నారు. ఇక్కడి నుంచే ఇతర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారానికి రాకపోకలు సాగించనున్నారు.
కాగా, పిఠాపురం నుంచి జనసేన ఎన్నికల సమరశంఖం పూరిస్తుందని, ఆ శంఖారావం రాష్ట్రమంతా వినిపించాలని పవన్ కల్యాణ్ నేతలకు నిర్దేశించారు. ఇవి రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు అని, కచ్చితంగా విజయం మనదే అని ధీమా వ్యక్తం చేశారు.