టెక్ట్స్ మెసేజ్ రూపంలోకి వాయిస్ నోట్ లు... కొత్త ఫీచర్ తీసుకువస్తున్న వాట్సాప్
- వాయిస్ మెసేజ్ లను టెక్ట్స్ మెసేజ్ లు గా మార్చే టెక్నాలజీ
- స్పీచ్ రికగ్నిషన్ సాంకేతికతో పనిచేసే కొత్త ఫీచర్
- ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఫీచర్
ప్రస్తుతానికి ఐఫోన్ యూజర్లకు ఈ ఫీచర్ బీటా వెర్షన్ రూపంలో అందుబాటులో ఉంది. త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా ప్రయోగాత్మకంగా అందించనున్నారు. వినికిడి లోపం ఉన్న వారికి ఈ ఫీచర్ ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని వాట్సాప్ భావిస్తోంది.