'రజాకార్' సినిమా నిర్మాతకు బెదిరింపు కాల్స్... సీఆర్పీఎఫ్ భద్రత కల్పించిన కేంద్రం
- తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని నిర్మాత గూడూరు నారాయణరెడ్డి ఫిర్యాదు
- నిఘా వర్గాల ద్వారా దర్యాఫ్తు చేసి భద్రత కల్పించిన కేంద్ర ప్రభుత్వం
- 1+1 సీఆర్పీఎఫ్ జవాన్లతో భద్రతను కేటాయించిన ప్రభుత్వం
కాగా, గూడురు నారాయణ రెడ్డి నిర్మాతగా, యాటా సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన రజాకార్ సినిమా పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ సినిమాలో ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ కీలక పాత్ర పోషించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ సినిమా విడుదల కావాల్సింది. కొన్ని కారణాల వల్ల అప్పుడు విడుదల కాలేదు. ఇటీవల ఈ సినిమాను విడుదల చేశారు.