Section 144: ల‌క్నోలో మే 17 వ‌ర‌కు 144 సెక్ష‌న్‌.. కార‌ణం ఏమిటంటే..!

  • లోక్‌స‌భ‌ ఎన్నిక‌లు, హోలీ, రంజాన్‌తో పాటు ఇత‌ర మ‌త‌ప‌ర‌మైన పండుగ‌ల దృష్ట్యా 144 సెక్ష‌న్ అమ‌లు
  • ల‌క్నో న‌గ‌ర పోలీస్ అధికారి ఉపేంద్ర కుమార్ అగ‌ర్వాల్ వెల్ల‌డి
  • ముంద‌స్తు అనుమ‌తి లేకుండా సామాజిక కార్యక్ర‌మాలు, నిర‌స‌న‌లు, నిరాహార దీక్ష‌లు చేప‌ట్ట‌డంపై నిషేధం
  • ల‌క్నో లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి మే 20న‌  ఎన్నిక‌లు
  • ల‌క్నో లోక్‌స‌భ బీజేపీ అభ్య‌ర్థిగా బ‌రిలో రాజ్‌నాథ్ సింగ్
Section 144 Imposed Lucknow till May 17

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని యోగి ఆదిత్య‌నాథ్ ప్ర‌భుత్వం రాష్ట్ర రాజ‌ధాని ల‌క్నోలో మే 17వ తేదీ వ‌ర‌కు 144 సెక్ష‌న్ విధించింది. రాబోయే లోక్‌స‌భ‌ ఎన్నిక‌లు, హోలీ, రంజాన్‌తో పాటు ఇత‌ర మ‌త‌ప‌ర‌మైన పండుగ‌ల దృష్ట్యా ల‌క్నోలో 144 సెక్ష‌న్ అమ‌లు చేస్తున్న‌ట్లు న‌గ‌ర‌ పోలీస్ అధికారి ఉపేంద్ర కుమార్ అగ‌ర్వాల్ వెల్ల‌డించారు. ఇక ల‌క్నో లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి ఐదో ద‌శ‌లో మే 20న‌  ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మొత్తంగా లోక్‌స‌భ‌ ఎన్నిక‌లు ఏప్రిల్ 19, 26 తేదీల‌తో పాటు మే 7, 13, 20, 25 తేదీల‌లో, జూన్ 1వ తారీఖున ఇలా ఏడు ద‌శ‌ల్లో జ‌రుగుతాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4వ తేదీన ఉంటుంది. 
 
ఇక‌ పోలీసుల నిషేధాజ్ఞ‌ల ప్ర‌కారం, ఐదుగురి కంటే ఎక్కువ మంది ఒక‌చోట చేర‌కూడ‌దు. పాద‌యాత్ర‌లు నిర్వ‌హించ‌డం, బాణసంచా కాల్చ‌డం, లౌడ్ స్పీక‌ర్లు, మ్యూజిక్ బ్యాండ్‌లను వినియోగించ‌డం వంటివి చేయ‌కూడదు. అలాగే ముంద‌స్తు అనుమ‌తి లేకుండా సామాజిక కార్యక్ర‌మాలు, నిర‌స‌న‌లు, నిరాహార దీక్ష‌లు చేప‌ట్ట‌డంపై నిషేధం ఉంటుంది. 

ఇదిలాఉంటే.. ల‌క్నోలో స‌మాజ్‌వాదీ పార్టీ అభ్య‌ర్థి ర‌విదాస్ మెహ్రోత్రాపై అధికార బీజేపీ కేంద్ర ర‌క్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను బ‌రిలోకి దింపుతోంది. ఇక రాజ్‌నాథ్ సింగ్ 2014, 2019 లోక్‌స‌భ‌ ఎన్నిక‌ల్లో ల‌క్నో నుంచి గెలిచారు. కాగా, 1991 నుంచి లక్నో స్థానం బీజేపీకి కంచుకోట‌గా ఉన్న విష‌యం విదిత‌మే.

More Telugu News