Rashmika Mandanna: 'పుష్ప‌-2'లో ర‌ష్మిక లుక్ లీక్‌.. సోష‌ల్ మీడియాలో ఫొటో వైర‌ల్‌!

  • ఫొటోలో ఎరుపు రంగు చీర‌, బంగారు ఆభ‌ర‌ణాల‌తో క‌నిపించిన ర‌ష్మిక మందన్న ‌ 
  • ఫొటోను నెట్టింట వైర‌ల్ చేస్తున్న ఫ్యాన్స్‌
  • యాగంటి ఆల‌యంలో మూవీ షూటింగ్ విశేషాల‌ను త‌న‌ ఇన్‌స్టా స్టోరీ ద్వారా పంచుకున్న నేష‌న‌ల్ క్ర‌ష్‌ 
  • 'పింక్‌విల్లా'తో ఇంట‌ర్వ్యూలో పుష్ప‌-2లోని త‌న పాత్ర గురించి కొన్ని విష‌యాలు వెల్ల‌డించిన ర‌ష్మిక‌ 
Rashmika Mandanna Dressed In A Saree Spotted On Pushpa 2 Set goes Viral on Social Media

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కిస్తోన్న 'పుష్ప‌-2' షూటింగ్ ఫొటోలు బ‌య‌ట‌కు రావ‌డంతో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. తాజాగా షూటింగ్ సెట్‌లో ఉన్న హీరోయిన్ ర‌ష్మిక మందన్న లుక్ లీకైంది. శ్రీవ‌ల్లి పాత్ర‌లో న‌టిస్తోన్న నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక ఎరుపు రంగు చీర‌లో బంగారు ఆభ‌ర‌ణాలు ధ‌రించి ఎంతో అందంగా క‌నిపిస్తోంది. ఈ ఫొటోను అభిమానులు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ చేస్తున్నారు. 

ఇదిలాఉంటే.. ఇటీవ‌ల నంద్యాల జిల్లాలోని యాగంటి ఆల‌యంలో ఈ మూవీ షూటింగ్ విశేషాల‌ను త‌న‌ ఇన్‌స్టా స్టోరీలో ర‌ష్మిక అభిమానుల‌తో పంచుకుంది. షూటింగ్ స్పాట్‌లో తీసిన ఫొటోను కూడా షేర్ చేసింది. "ఇవాళ ఈ దేవాల‌యంలో మూవీ చిత్రీక‌ర‌ణ‌ జ‌రిగింది. యాగంటి అని పిల‌వ‌బ‌డే ఈ ఆల‌య స్థ‌ల పురాణం  నిజంగా చాలా అద్భుతం. ఇక్క‌డి ప్ర‌జ‌లు, వారి ప్రేమ మాట‌ల్లో చెప్ప‌లేం. ఈ రోజు చాలా అద్భుతంగా గ‌డిచింది" అని చెప్పుకొచ్చింది. 

కాగా, కొన్ని రోజుల ముందు 'పింక్‌విల్లా'తో ఇంట‌ర్వ్యూలో 'పుష్ప‌-2'లోని త‌న పాత్ర గురించి కొన్ని విష‌యాలు వెల్ల‌డించింది. "మూవీలో పుష్ప భార్య‌గా నా పాత్ర బాధ్య‌త‌తో కూడుకుని ఉంటుంది. మొద‌టి భాగం కంటే రెండో భాగంలో చాలా డ్రామాతో పాటు పాత్ర‌ల మ‌ధ్య వైవిధ్యం కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పార్ట్-2లో అభిమానులు కోరుకునే మ‌సాలా చాలా ఎక్కువ‌గా ఉంటుంది" అని తెలిపింది.   

 ఇక 2021లో పుష్ప మొద‌టి పార్ట్‌.. 'పుష్ప‌: ద రైజ్' పేరుతో వ‌చ్చి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న విష‌యం తెలిసిందే. తెలుగుతో పాటు హిందీలో భారీ వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇక పుష్ప‌కు సీక్వెల్‌గా వ‌స్తున్న 'పుష్ప‌-2' (ద రూల్‌) ఆగ‌స్టు 15న విడుద‌ల కానుంది. ప్ర‌స్తుతం మూవీ షూటింగ్‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు ద‌ర్శ‌కుడు సుకుమార్‌. ఇందులో ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో ఫ‌హాద్ ఫాజిల్‌, జ‌గ‌దీష్ ప్ర‌తాప్ బండారీ, సునీల్, అన‌సూయ‌, రాజ్ తిర‌న్‌దాసు నటిస్తున్నారు. 

More Telugu News