Pradeep Sharma: ఛోటా రాజన్ అనుచరుడి ఎన్ కౌంటర్ కేసు... మాజీ పోలీసు అధికారి ప్రదీప్ శర్మకు జీవితఖైదు

  • 2006లో కాల్పుల్లో గ్యాంగ్ స్టర్ లఖన్ భయ్యా హతం
  • ప్రదీప్ శర్మ, మరో 12 మందిపై బూటకపు ఎన్ కౌంటర్ అభియోగాలు
  • కింది కోర్టు విధించిన శిక్షలను సమర్థించిన బాంబే హైకోర్టు
Former Police officer Pradeep Sharma gets life term prison

మాఫియా డాన్ ఛోటా రాజన్ అనుచరుడి ఎన్ కౌంటర్ కేసులో మాజీ పోలీసు అధికారి ప్రదీప్ శర్మకు జీవిత ఖైదు విధిస్తూ బాంబే హైకోర్టు నేడు తీర్పునిచ్చింది. కింది కోర్టు తీర్పును బాంబే హైకోర్టు సమర్థించింది. ఇది బూటకపు ఎన్ కౌంటరేనని నిర్ధారించింది. 

ఛోటా రాజన్ ముఖ్య అనుచరుడు లఖన్ భయ్యా 2006లో ఎన్ కౌంటర్ లో మృతి చెందాడు. ఈ కేసులో ప్రదీప్ శర్మతో పాటు, మరో 13 మంది అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అందులో 12 మంది పోలీసులు, బయటి వ్యక్తి ఒకరు ఉన్నారు.

అయితే గతంలో ఈ కేసులో ప్రదీప్ శర్మను ట్రయల్ కోర్టు నిర్దోషిగా పేర్కొనగా, అతడి నిర్దోషిత్వాన్ని బాంబే హైకోర్టు రద్దు చేసింది. అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకుని అతడు దోషి అని నిర్ధారించింది. 

ప్రదీప్ శర్మకు మహారాష్ట్రలో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా గుర్తింపు ఉంది. ఆయన 112 మంది కరుడుగట్టిన నేరస్తులను వివిధ ఎన్ కౌంటర్లలో అంతమొందించాడని చెబుతుంటారు. ప్రదీప్ శర్మ గతంలో ముఖేశ్ అంబానీ నివాసం ఆంటిల్లా ఎదుట పేలుడు పదార్థాలు లభ్యమైన కేసులోనూ, మన్సుఖ్ హిరేన్ హత్య కేసులోనూ నిందితుడిగా ఉన్నారు.

More Telugu News