Usthad Bhagath Singh: గ్లాస్ అంటే సైజ్ కాదు .. సైన్యం: 'ఉస్తాద్ భగత్ సింగ్' గా పవన్ డైలాగ్

  • 'ఉస్తాద్ భగత్ సింగ్' గా పవన్ కల్యాణ్ 
  • ఆయన జోడీకడుతున్న శ్రీలీల
  • హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా  
  • లైన్లో ఉన్న 'OG' .. 'హరి హర వీరమల్లు'

Usthad Bhagath Singh Blaze Released

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా రూపొందుతోంది. ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను వదిలిన దగ్గర నుంచి అంచనాలు పెరుగుతూ వెళుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన షూటింగు కొంతవరకూ జరిగింది. ఎన్నికల తరువాత నుంచి మళ్లీ పవన్ ఈ సినిమా షూటింగులో పాల్గొననున్నాడు. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి 'భగత్స్ బ్లేజ్' పేరుతో కొంతసేపటి క్రితం ఒక వీడియోను రిలీజ్ చేశారు. జాతర సమయంలో హింసకి పాల్పడటానికి ట్రై చేసిన రౌడీ మూకకి పోలీస్ ఆఫీసర్ గా పవన్ బుద్ధి చెప్పడం ఈ వీడియోలో చూపించారు. ఆ సందర్భంలో 'గాజు పగిలేకొద్దీ పదునెక్కుద్ది .. కచ్చితంగా గుర్తుపెట్టుకో .. గ్లాస్ అంటే సైజ్ కాదు .. సైన్యం .. కనిపించని సైన్యం' అంటూ పవన్ చెప్పిన డైలాగ్స్ ఆయన ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటాయి. 

మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో, శ్రీలీల కథానాయికగా అలరించనుంది. ఈ సినిమాతో పాటు సుజీత్ దర్శకత్వంలో పవన్ 'OG' చేస్తున్నాడు. సెప్టెంబర్ 27న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇక క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న 'హరి హర వీరమల్లు'  సెట్స్ పైనే ఉంది.

More Telugu News