చావు నుంచి త్రుటిలో తప్పించుకున్నాను: హీరోయిన్ సురభి

I narrowly escaped death says Heroine Surabhi
  • విమానంలో సాంకేతిక లోపం తలెత్తి ప్రమాదం అంచున నిలిచామన్న నటి
  • విమానం నియంత్రణ తప్పడంతో భయమేసిందని వెల్లడి
  • పైలెట్ తెలివైన నిర్ణయంతో అంతా బతికిపోయామన్న సురభి
‘బీరువా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత పలు చిత్రాల్లో అలరించిన తెలుగు హీరోయిన్ సురభి.. తాను త్రుటిలో చావు నుంచి తప్పించుకున్నానని చెప్పారు. ఆ విషయాన్ని గుర్తుచేసుకుంటేనే చాలా భయంకరంగా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా ఆమె ఒక పోస్ట్ షేర్ చేశారు. ఇదివరకెప్పుడూ ఎదురుకాని ఒక ఘటన ఆదివారం ఎదురైందని, తాను ప్రయాణించిన ఓ విమానం సాంకేతిక లోపానికి గురై ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. విమానం పైలెట్ నియంత్రణలో లేకుండా పోయిందని, ఆ సమయంలో బాగా భయం వేసిందని ఆమె చెప్పారు. అయితే పైలెట్ తెలివైన నిర్ణయం కారణంగా అంతా ప్రాణాలతో బయటపడ్డామని ఆమె వెల్లడించారు.

చావు అంచుల దాకా వెళ్లొచ్చాననే భావన కలిగిందని ఆమె చెప్పుకొచ్చింది. ఆ ఘటన గుర్తుచేసుకుంటే ఇప్పటికీ భయం వేస్తోందని అన్నారు. తాను ఈ రోజు ఇలా బతికుండడంతో తనలోని సానుకూల దృక్పథం పట్ల మరింత నమ్మకం కలిగిందని ఆమె అన్నారు. ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఏ విమానం, ఎక్కడికి ప్రయాణిస్తున్న సమయంలో జరిగిందనే విషయాలను హీరోయిన్ సురభి వెల్లడించలేదు.

కాగా హీరోయిన్ సురభి ‘బీరువా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. తెలుగులో ఎక్స్‌ప్రెస్ రాజా, ఎటాక్, జెంటిల్‌మెన్‌లతో పాటు పలు సినిమాల్లో నటించారు.
Go Back to Shorts
Heroine Surabhi
Tollywood
Movie News
Plane

More Telugu News