Kalki: 'కల్కి 2898 AD' కోసం భారీ సెట్ .. కీలకమైన షెడ్యూల్!

  • ప్రభాస్ హీరోగా రూపొందుతున్న 'కల్కి'
  • కథానాయికగా అలరించనున్న దిశా పటాని 
  • కీలకమైన పాత్రల్లో అమితాబ్ - కమల్
  • వైజయంతీ బ్యానర్లోనే పెద్ద బడ్జెట్ సినిమా ఇది 
Kalki Movie Update

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ 'కల్కి 2898 AD' సినిమాను రూపొందిస్తున్నాడు. అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అత్యధిక బడ్జెట్ తో నిర్మితమవుతున్న సినిమా ఇది.  పాన్ వరల్డ్ సినిమా అంటూ ఆదిలోనే ఈ ప్రాజెక్టుపై నాగ్ అశ్విన్ అంచనాలు పెంచేశాడు. అప్పటి నుంచి ఈ సినిమా విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిని చూపిస్తున్నారు. 

ఈ సినిమాకి సంబంధించిన కొన్ని షెడ్యూల్స్ ఆల్రెడీ పూర్తయ్యాయి. ఇటీవలే పూర్తి చేసుకున్న ఒక షెడ్యూల్లో ప్రభాస్ - దిశా పటాని కాంబినేషన్లో ఒక రొమాంటిక్ సాంగ్ ను షూట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సాంగ్ ను ఆడియన్స్ ఒక రేంజ్ లో ఎంజాయ్ చేస్తారని అంటున్నారు. త్వరలోనే మరో షెడ్యూల్ ను మొదలెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. 

ఈ షెడ్యూల్లో ప్రభాస్ .. అమితాబ్ ..  కమల్ పాల్గొననున్నారు. ఈ ముగ్గురి కాంబినేషన్లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారట. అందుకు అవసరమైన భారీ సెట్ ను హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో వేశారని సమాచారం. ఇది చాలా కీలకమైన షెడ్యూల్ అని అంటున్నారు. ఈ సీన్స్ కూడా కథలో కీలకమైన సమయంలో తెరపైకి వస్తాయని చెబుతున్నారు. సంతోష్ నారాయణ్ నేపథ్య సంగీతం హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. 

More Telugu News