WPL: నేడు డబ్ల్యూపీఎల్ ఫైనల్: టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్

Delhi Capitals Women won the toss and elected bat first in WPL summit clash against RCB Women

  • ఆఖరి దశకు చేరుకున్న డబ్ల్యూపీఎల్
  • నేడు ఢిల్లీలో ఫైనల్ మ్యాచ్
  • ఆర్సీబీపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

భారత్ లో ఐపీఎల్ తరహాలోనే మహిళా క్రికెటర్లతో బీసీసీఐ నిర్వహిస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఆఖరి దశకు చేరుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య నేడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 

ఇరు జట్లలోనూ స్టార్ ఉమెన్ క్రికెటర్లు ఉండడంతో పోరు ఆసక్తికరంగా ఉండనుంది. ఢిల్లీ జట్టులో కెప్టెన్ మెగ్ లానింగ్, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, జెస్ జొనాసెన్, అలైస్ కాప్సే తమ పవర్ హిట్టింగ్ తో చెలరేగితే భారీ స్కోరు సాధించడం కష్టమేమీ కాదు. 

ఇక, బెంగళూరు జట్టు విషయానికొస్తే... కెప్టెన్ స్మృతి మంధన, ఆసీస్ ఆల్ రౌండర్ ఎలిస్ పెర్రీ ఆ జట్టు ప్రధాన బలం. సోఫీ డివైన్, తెలుగమ్మాయి సబ్బినేని మేఘన కూడా రాణిస్తే ఆ జట్టును ఆపడం సులభం కాదు. రెండు జట్లులోనూ ప్రతిభావంతులైన బౌలర్లు ఉండడంతో బ్యాట్ కు బంతికి మధ్య రసవత్తర పోరు జరిగే అవకాశం ఉంది.

WPL
Final
Delhi Capitals Women
RCB Women
Arun Jaitly Stadium
Delhi
  • Loading...

More Telugu News